Kakinada: విద్యార్థులతో కలిసి మధ్యాన్న భోజనం చేసిన కలెక్టర్

Kakinada: విద్యార్థులతో కలిసి మధ్యాన్న భోజనం చేసిన కలెక్టర్
x
Highlights

కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని ఇంద్రపాలంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పర్యటించారు. ఈ సంధర్బంగా జిల్లా పరిషత్ హైస్కూల్‌ ను...

కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని ఇంద్రపాలంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పర్యటించారు. ఈ సంధర్బంగా జిల్లా పరిషత్ హైస్కూల్‌ ను కలెక్టర్ మురళీధర్ రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాల గదులు మరియు ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడానికి, పాఠశాలల్లో హాజరును మెరుగుపరచడానికి మధ్యాహ్నం భోజన పథకం యొక్క మెనూని మార్చేశారని అన్నారు.

విద్యార్థులు తమ పిల్లల చదువుల నిమిత్తం డబ్బుకోసం ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉంద్ద్యేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించి, వారి బిడ్డలను పాఠశాలకు పంపించడానికి తల్లికి ఆర్థిక సహాయం అందిస్తున్నారని గుర్తుచేశారు. ఆహార నాణ్యతను తరచూ పరీక్షిస్తానని, రోజూ వండిన అదే రకమైన ఆహారాన్ని పిల్లలకు అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిరోజూ ఆహార పదార్థాలను మారిస్తేనే పిల్లలు ఆహారాన్ని ఇష్టపడతారని, వారం రోజులకు మెనును విడిగా షెడ్యూల్ చేయబడిందని ఆయన అన్నారు.

సోమవారం - వైట్ రైస్, పప్పు మరియు గుడ్డు కూర, మంగళవారం - పులిహోర, టమోటా పప్పు, గుడ్డు, బుధవారం - వెజిటబుల్ రైస్, బంగాళాదుంప కూర మరియు గుడ్డు, గురువారం - కిచిడి, టమోటా పచ్చడి మరియు గుడ్డు, శుక్రవారం - వైట్ రైస్ , ఆకు కూర మరియు గుడ్డు, శనివారం - సాంబార్ అన్నం మరియు పొంగలి. అన్నారు. డిఇఓ ఎస్ అబ్రహం, ఎంఇఒ గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉండాలంటే నాణ్యమైన, రుచి, శుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మెనూ ప్రవేశపెట్టింది. ఈ నూతన మెనూ కు జగనన్న గోరుముద్ద అని నామకరణం చేశారు. సంక్రాంతి సెలవుల అనంతరం మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో నూతన మెనూ అన్ని బడుల్లో అమలుచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories