నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు

Earthquake in Nellore Districts People Run Away From Homes
x

నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు

Highlights

Earthquake: శనివారం రెండుసార్లు కంపించిన భూమి

Earthquake: నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతంలో భూ ప్రకంపనలు రావడం కలకలం రేపింది. శనివారం ఉదయం ఒకసారి రాత్రివేళ మరోసారి మొత్తం రెండుసార్లు భూమి కంపించింది. దీంతో జనం ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ముఖ్యంగా వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు మండలాల్లోని గ్రామాల్లో భూమి కంపించింది. 5 నుంచి 10 సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే రాత్రివేళ కావడం ఒకేరోజు రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించినప్పుడు పెద్ద శబ్ధాలు రావడంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదయం కంటే రాత్రి ఎక్కువ సమయం కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి అందించారు. అయితే గత నెలలో కూడా ఇవే ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. జులై 13 న భూమి కంపించిందని మళ్లీ ఆగస్టులో అదే తేదీన భూమి కంపించడంపై స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories