కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అర్ధరాత్రి కంపించిన భూమి

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అర్ధరాత్రి కంపించిన భూమి
x
Highlights

కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. రాత్రి 2 గంటల 38 నిమిషాలకు...

కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. రాత్రి 2 గంటల 38 నిమిషాలకు స్పల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. కృష్ణాజిల్లాలోని నందిగామ, నియోజకవర్గం పరిధిలోని చందర్లపాడు, కంచికచెర్ల, వీరులపాడు, నందిగామ 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇటు జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలల్లో రాత్రి 2 గంటల 37 నిమిషాలకు కొన్ని గ్రామాలలో సుమారు 6 నుంచి 8 సెకండ్ల వరకు కంపించినట్టు ప్రజలు తెలిపారు. దీంతో ఒక్క సారిగా ఇళ్ల లో నుంచి జనం రోడ్ల మీదకు పరుగులు తీశారు.

అలాగే గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో రెండు సార్లు సెకన్ల మేర కంపించడాన్ని గమనించిన ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. కొందరు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీస్తే.. మరికొందరు మిద్దెలు ఎక్కారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా భూమి కంపించడంపై అధికారులకు సమాచారం అందింది. దీనిపై వారు ఆరా తీస్తున్నారు. భూమి ఒక్కసారిగా కంపించడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై వారు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories