Srisailam: నిజాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబికా దేవి

Dussehra Celebrations in Srisailam Ended
x

నిజాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబికా దేవి 

Highlights

Srisailam: నందివాహనంపై ఆలయ ప్రదక్షిణ, జమ్మి చెట్టువద్ద శమీ పూజ

Srisailam: శ్రీశైలంలో దసరా మహోత్సవాలు తొమ్మిది రోజులపాటు కనులపండువగా జరిగాయి. పదో రోజు అమ్మ వారు నిజాలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబికాదేవి అలంకారంలో ఉన్న అమ్మ వారికి మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అక్కమహా దేవి అలంకార మండపం వద్ద నంది వాహనంపై ఉన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవారిని ఊరేగింపుగా శమీవృక్షం వద్దకు తీసుకొచ్చి శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శమీపూజల అనంతరం ఆలయ పుష్కరిణిలో వైభవంగా శ్రీస్వామి అమ్మ వార్ల తెప్పోత్సవం నిర్వహించారు. ప్రత్యేక తెప్పపై ఆది దంపతులు విహారం చేస్తుండగా.. ఆలయ పుష్కరిణి ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణతో మారుమోగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories