వైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు

Due to The Inefficient Performance of the YCP Government
x

వైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు

Highlights

Nadendla Manohar: మంగళగిరిలో జనసేన ఐటీ విభాగం ఆత్మీయ సమ్మేళనం

Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం సంక్షేమం ముసుగులో అభివృద్ధిని మరచిపోయి. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తోందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఓవైపు హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతుంటే జగన్ పనితీరుతో ఏపీలో ఐటీ రంగం రోజు రోజుకూ దిగజారుతోందన్నారు. మున్ముందు పవన్ కల్యాణ్ ఆలోచనా విధానంతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఐటీ విభాగం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన సభ నుద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమం జనసేన చేపట్టిందన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ చాలా కీలకమన్న నాదెండ్ల. ఐటీ వింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పని చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories