నీట మునిగిన పొలాలు

నీట మునిగిన పొలాలు
x
నీట మునిగిన పొలాలు
Highlights

వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ఏర్పేడు మండలంలో పంట పొలాలు ఎండిపోతున్నాయి.

ఏర్పేడు: వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ఏర్పేడు మండలంలో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇది వరకే సాగైన పంటలు నష్టపొగా ప్రస్తుతం పంటలు వేసుకోవడానికి పొలాల్లో నీరు అధికంగా ఉండడంతో పనులు జరగక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు మల్లెమడుగు రిజర్వాయరు నుంచి అధిక శాతంలో నీరు దిగువకు విడుదల చేయడంతో దిగువనున్న ఏర్పేడు మండలంలోని చెరువులోకి నీరు అధికంగా చేరింది. దీంతో రెండు రోజుల నుంచి కోబాక చెరువు కళ్ళుజు పారుతుంది.

మిగులు నీరంతా కోబాక పొలాల్లోకి వెళ్లి పోతున్నాయి. తద్వారా రైతుల వ్యవసాయ పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మల్లెమడుగు రిజర్వాయరు నీటిని దిగువకు రాకుండా అరికట్టడానికి ఇరిగేషన్ అధికారులను ఏర్పేడు మండలం రైతులు సంప్రదించగా మడుగు రిజర్వాయర్ మరమ్మతులకు గురైందని, దీంతో అధిక శాతంలో నీరు దిగువకు వస్తుందన్నారు. ఈ మిగులు నీరుని కోబాక రైతులకు వద్దనుకుంటే మాధవమాల చెరువుకు ఆ నీటిని అందించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యపై ఏం చేయాలో అర్థం కాక రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories