ఐదేళ్ల నిరీక్షన.. దక్కిన ఫలితం

ఐదేళ్ల నిరీక్షన.. దక్కిన ఫలితం
x
Highlights

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న...

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పి) పదోన్నతికి ఆమోదం తెలిపారు.

దీంతో ఐదేళ్ల నిరీక్షణ తరువాత 22 మంది డిఎస్పీలను ఎఎస్‌పి ర్యాంకు పదోన్నతి వచ్చింది. ఎఎస్‌పిల ర్యాంకుకు పదోన్నతి పొందిన అధికారులు బుధవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలను రక్షించడానికి పూర్తి అంకితభావంతో పనిచేస్తామని వారు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

గతంలో అర్హతలున్నా కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందారని ముఖ్యమంత్రికి చెప్పారు. కానీ ఈసారి అన్ని వర్గాలకు చెందిన అర్హతగల అధికారులకు పక్షపాతం లేకుండా వారి అర్హతల ఆధారంగా ఎఎస్‌పి ర్యాంకు సాధించారని హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి మేకతోట సుచరిత, డిజిపి గౌతమ్ సవాంగ్, అదనపు డిజి రవిశంకర్ అయ్యంగార్ హాజరయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories