గుంటూరులో డ్రగ్స్ కలకలం.. గుట్టుగా తయారీ, వాళ్ళే టార్గెట్..

గుంటూరులో డ్రగ్స్ కలకలం.. గుట్టుగా తయారీ, వాళ్ళే టార్గెట్..
x
Highlights

గుంటూరు జిల్లాలో భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నల్లపాడు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు సోదాలు చేశారు.. కొంతకాలంగా...

గుంటూరు జిల్లాలో భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నల్లపాడు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు సోదాలు చేశారు.. కొంతకాలంగా అక్కడ గుట్టుగా డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్టు అక్కడే తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సౌదీకి చెందిన షాజీ అనే వ్యక్తి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆ ఇంట్లో గ్లౌజ్‌లు, ఫేస్ మాస్క్‌లతో పాటూ మరికొన్ని మత్తు పదార్ధాలను తయారు చేసే వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.

షాజీని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువతనే టార్గెట్ చేసుకొని డ్రగ్స్ తయారు చేసి.. అమ్ముతున్నట్లు అనుమానిస్తున్నారు. ఇంకా ఈ దందాలో ఎవరెవరు ఉన్నారో అని పోలీసులు ఆరాతీస్తున్నారు. కాగా మంగళగిరి, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి కలకలంరేపింది. ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories