
ఇవాళ శ్రీశైలం మల్లన్న సన్నిధికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu: ముర్ముతోపాటు ఆమెకుమార్తె ఇతిశ్రీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించనున్నారు.. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. దైవ దర్శనానంతరం దేవస్థానం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు రాష్ట్రపతి రాక సందర్భంగా అధికార యంత్రాంగం స్వాగత ఏర్పాట్లల్లో తలమునకలైంది. రాష్ట్రపతి కన్వాయ్ కి సంబంధించి రెండుసార్లు ట్రైల్ రన్ నిర్వహించారు... ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, జ్యోతిర్లింగం శక్తిపీఠం కలగలిసిన క్షేత్రాలలో మూడవదిగా ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీశైలంను దేశ ప్రధమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ దర్శించుకొనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి అపూర్వ స్వాగతం పలికేందుకు అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని, వివిధ పూజ ద్రవ్యాలతోనూ, పంచామృతాలతో రుద్రాభిషేకం, బ్రమరాంబికా దేవికి కుంకుమార్చనను నిర్వహించనున్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ మన్జీర్ జిలాని, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఇఓ లవన్న పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తిచేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడినుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ మన్జీర్ జిలాని అధికార యంత్రాంగంతో కలిసి ఘనంగా స్వాగతించే విధంగా ఏర్పాట్లుచేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ఆమె కుమార్తె ఇతిశ్రీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై శ్రీశైల క్షేత్రానికి చేరుకోనున్నారు... భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ఆర్మీ అధికారులు అనుమతిని మంజూరు చేశారు... రాష్ట్రపతి పర్యటనలో విధులు నిర్వహించే వివిధ శాఖల సిబ్బందికి సంబంధించి ప్రత్యేక పాసులు కేటాయించారు...భ్రమరాంబ సమేత మల్లికార్జున దర్శించుకునేందుకు దేశ ప్రథమ పౌరురాలు వస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆమె పర్యటనను సక్సెస్ చేసేందుకు జిల్లా యంత్రంగా కసరత్తు పూర్తిచేసింది.
సున్నిపెంట వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి పది కిలోమీటర్ల మేర శ్రీశైల క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి చేరుకోనున్నారు... శ్రీగిరి క్షేత్రం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది ఇప్పటికే అడవంతా గ్రేహౌండ్స్ బలగాలతో అధికారులు జల్లెడ పట్టారు దేవస్థానంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాన్ని అర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది... వందల మంది పోలీసులతో రహదారి వెంట పహారా కాస్తున్నారు మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ తర్వాత మొదటిసారి గా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆమె పర్యటన కి సంబంధించి అన్ని ఏర్పాట్లను స్వయంగా నంద్యాల జిల్లా కలెక్టర్ మన్జీర్ జిలాని,ఎస్పి రఘువీర్ రెడ్డి పర్యవేక్షించారు.
శ్రీశైలంలో శ్రీకృష్ణదేవరాయ గోపురంగా పిలువబడే ప్రధాన రాజగోపురం వద్ద రాష్ట్రపతికి వేద పండితుల మంత్రోచ్ఛారణతో, పూర్ణకుంభంతో స్వాగతిస్తారు. ఈ సందర్బంగా శ్రీశైలం మల్లన్న అమ్మవారికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేయనున్నారు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం.. శ్రీశైలంలో 47కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలు, దేవస్థాన సమాచార కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆతర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు వివిధ ప్రాంతాల నుండి తెప్పించిన పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
భారత రాష్ట్రపతి పర్యటనతో శ్రీశైలం క్షేత్రం పరిసరాలతో పాటు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన లింగాల గట్టు మరియు కర్నూల్ సరిహద్దు ప్రాంతంగా వున్న శిఖరం వద్ద ఉదయం 11 గంటలకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు.. రాష్ట్రపతి శ్రీశైలం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు... మరోసారి మధ్యాహ్నం రెండు గంటలకు వాహనాలు రాకపోకలను నిలిపివేసి సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి వెళ్ళిన తరువాత వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు....దీంతో ఎవరైనా శ్రీశైలానికి చేరుకునే భక్తులు ఉదయం 10 గంటల లోపు వచ్చే విధంగా, శ్రీశైలం నుండి బయలుదేరేవారు ఉదయం 9 గంటల లోపు వెళ్లిపోయే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని భారత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
శ్రీశైల మహా క్షేత్ర విశిష్టతను, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ప్రాముఖ్యత, ఆలయ చారిత్రక విషయాలతో రూపుదిద్దుకున్న లేజర్ షో వ్యవస్థను ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభిస్తారు. క్షేత్ర విశిష్టత లేజర్ కాంతులతో, గంభీరమైన గాత్రం ద్వారా వింటూ, వీక్షించేందుకు వీలుగా లేజర్ షో రూపొందించారు. శ్రీశైలం దేవస్థానం ఈ లేజర్ షో ఏర్పాటును చేసి భక్తులకు సరికొత్త అనుభూతిని కల్పించాలని పాలకమండలితో చర్చించిన ఈవో లవన్న ప్రాజెక్టు రూపకల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శ్రీగిరి క్షేత్రం తాజాగా ఈ లేజర్ కాంతుల్లో మరింత శోభను సంతరించుకోబోతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




