Top
logo

నడి రోడ్డు పై వ్యాయామ ఉపాధ్యాయుడి దారుణ హత్య!

నడి రోడ్డు పై వ్యాయామ ఉపాధ్యాయుడి దారుణ హత్య!
X
Highlights

ఒకప్పటి కాలంలో మనిషికి, మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడున్న కాలంలో కొంతమందిలో మానవత్వం మంటగలిసి పోతుంది.

ఒకప్పటి కాలంలో మనిషికి, మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువగా ఉండేవి. కాని ఇప్పుడున్న కాలంలో కొంతమందిలో మానవత్వం మంటగలిసి పోతుంది. ఎక్కడ చూసినా హత్యలు, దొంగతనాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఇవే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే పశ్చిమగోదావరి జిల్లాలోనూ చోటు చేసుకుంది. పట్ట పగలు నడి రోడ్డుపై ఒక ఉపాద్యాయున్నిదారుణంగా హత్య చేసారు.

పూర్తి వివరాల్లోకెళితే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మినీ బైపాస్‌ రోడ్డులో ఈ దారుణం జరిగింది. ప్రముఖ పాఠశాలలో నాగరాజు అనే వ్యక్తి వ్యాయామ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ఈయన తన పని నిమిత్తం రోడ్ పైన వెళ్తున్నాడు. అదే సమయంలో అదును చూసి దుండగులు అతన్ని అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేసారు. అతని వద్ద ఉన్న 15 కాసుల బంగారం, రూ.2 లక్షలను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Next Story