సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుంది : డాక్టర్ సుధాకర్ తల్లి

సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుంది : డాక్టర్ సుధాకర్ తల్లి
x
Dr Sudhakar (File Photo)
Highlights

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు మలుపులు తిరుగుతూ సీబీఐ ముంగిట్లోకి చేరుకుంది.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు మలుపులు తిరుగుతూ సీబీఐ ముంగిట్లోకి చేరుకుంది. డాక్టర్‌ సుధాకర్‌ కేసును విచారించిన ఏపీ హైకోర్టు ప్రభుత్వ నివేదికలను తప్పుబట్టింది. విచారణను సీబీఐకి అప్పగించాలని, ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో సుధాకర్ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. మే 16న సుధాకర్ ఘటన జరిగిన ప్రదేశాన్ని సోమవారం సీబీఐ బృందం పరిశీలించింది. కాగా.. విశాఖలోని సీబీఐ కార్యాలయానికి సోమవారం సుధాకర్ తల్లి కావేరి బాయి వచ్చారు. సీబీఐ అధికారులను కలిసిన కావేరీ బాయి వినతిపత్రం అందించారు. తన కుమారుడి కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేయాలని ఆమె సీబీఐ అధికారులకు విన్నవించారు.

సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. సుధాకర్ పెద్ద కుమారుడు లలిత్ ను సోమవారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు విచారిస్తున్నారని ఆమె వెల్లడించారు. విచారణకు తాను కూడా సహకరిస్తానని అధికారులకు సమాధానాలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని ఆమె అన్నారు. పట్టణ పోలీసులను సీబీఐ అధికారి ఒకరు ఈరోజు(సోమవారం) విచారించారు.

ప్రభుత్వాన్ని విమర్శించటంతో ప్రారంభమైన డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. అసలే ప్రభుత్వంపై విమర్శలతో సస్పెన్షన్‌కు గురైన సుధాకర్‌.. విశాఖలో నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కనిపించిన వీడియోలు సంచలనం రేపాయి. అదే సమయంలో ఓ కానిస్టేబుల్‌ సుధాకర్‌తో దురుసుగా ప్రవర్తించిన వీడియోలో రికార్డవటం వివాదాన్ని మరింత పెద్దదిగా చేశాయి.

ఇక విశాఖ పోలీసులు సుధాకర్‌తో వ్యవహరించిన తీరుపై... వీడియోలతో సహా హైకోర్టుకు లేఖ రాశారు టీడీపీ నేత వంగలపూడి అనిత. ఈ లేఖను సుమోటో పిల్‌గా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. కేసు ను సీబీఐ కి అప్పగించడంతో తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానంటున్నారు సుధాకర్ తల్లి కావేరి భాయి. వైద్యుడిగా ఎంతోమందికి సేవలందించిన వ్యక్తిని పిచ్చివాడిగా ముద్ర వేయడం బాధ కలిగించిందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories