ఒంగోలులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్ ధనలక్ష్మీ పరిస్థితి విషమం

X
Representational Image
Highlights
* మూడు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్ ధనలక్ష్మీ * మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు * ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో డెంటల్ డాక్టర్ గా పనిచేస్తున్న ధనలక్ష్మీ
Sandeep Eggoju27 Jan 2021 3:52 AM GMT
ప్రకాశం జిల్లా ఒంగోలులో వ్యాక్సిన్ తీసుకున్న డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ విధులను విజయవంతంగా నిర్వహించిన డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి శనివారం వాక్సిన్ తీసుకున్నారు ఆ తర్వాత ఆమె అస్వస్థతకు గురికావడంతో రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అప్పటికి ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు.
Web TitleDr. Dhanalakshmi took the corona vaccine in Ongole, is in critical condition
Next Story