అవినీతి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతో తెలుసా?

అవినీతి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతో తెలుసా?
x
Highlights

ట్రాన్స్ పెరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ నిర్వహించిన 'ఇండియా కరప్షన్ సర్వే-2019'లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర...

ట్రాన్స్ పెరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ నిర్వహించిన 'ఇండియా కరప్షన్ సర్వే-2019'లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత మేలు అని చెప్పవచ్చు. అవినీతి మచ్చ లేని కేజ్రీవాల్ పరిపాలిస్తున్న ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ పెద్ద తేడా ఏమి లేదు. స్పందన, గ్రామా వాలంటీర్ వ్యవస్థ వచ్చాక క్షేత్రస్థాయిలో అవినీతి తగ్గిందనడానికి ఈ సర్వే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ మాత్రం ఐదో స్థానంలో ఉంది.

జాతీయ సగటు కంటే తక్కువ లంచాలు తీసుకున్న దక్షిణ భారత రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, కేరళ ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌లోని 50% పౌరులు తమ పనికోసం లంచం ఇచ్చినట్లు అంగీకరించారు, అందులో 30% లంచాలు చాలాసార్లు (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) ఇవ్వగా, 20% మంది ఒకటి లేదా రెండుసార్లు (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) లంచం ఇచ్చారు. 30% వారు లంచం చెల్లించకుండా పని చేశారని చెప్పారు.

ఆస్తి నమోదుకు, భూ సమస్యల పరిష్కారం కోసం 43% లంచం ఇవ్వగా, ఇందులో 21% మునిసిపల్ కార్పొరేషన్ కు ఇచ్చారు. అలాగే 7% పోలీసులకు లంచం, 29% ఇతరులకు (విద్యుత్ బోర్డు, రవాణా కార్యాలయం, పన్ను కార్యాలయం మొదలైనవి) చెల్లించారు.

ఇండియాలో టాప్ 15 అవినీతి రాష్ట్రాలు ఇవే:

రాజస్థాన్

బీహార్

జార్ఖండ్

ఉత్తరప్రదేశ్

తెలంగాణ

కర్ణాటక

పంజాబ్

తమిళనాడు

చత్తీస్ ఘడ్

మధ్యప్రదేశ్

మహారాష్ట్ర

ఉత్తరాఖండ్

ఆంధ్రప్రదేశ్

గుజరాత్

ఢిల్లీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories