వీసాల కోసం కన్సల్టెన్సీలను నమ్మవద్దు

వీసాల కోసం కన్సల్టెన్సీలను నమ్మవద్దు
x
డేవిడ్ జోసార్
Highlights

విద్యార్థులు యూఎస్ వీసాల కోసం కన్సల్టన్సీలను నమ్మవద్దని యూఎస్ కాన్సులేట్మెంబర్ డేవిడ్ జోసార్ పేర్కొన్నారు.

చేబ్రోలు: విద్యార్థులు యూఎస్ వీసాల కోసం కన్సల్టన్సీలను నమ్మవద్దని యూఎస్ కాన్సులేట్మెంబర్ డేవిడ్ జోసార్ పేర్కొన్నారు. మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్స్యూనివర్సిటీలో మంగళవారం " హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్"అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగావిచ్చేసిన డేవిడ్ జోసార్ మాట్లాడుతూ విద్యార్థులు వీసా కోసం ప్రయత్నించేటప్పుడుతప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించవద్దన్నారు.

అంతేకాకుండా విద్యార్థులువీసా అప్లికేషన్ ను ఎలా అప్లై చేసుకోవాలి? అందులో ప్రొఫైల్ క్రియేషన్, కంప్లీట్ఆన్లైన్ అప్లికేషన్, ఫీజు చెల్లింపులు, షెడ్యూల్ అపాయింట్మెంట్స్ ఎలాపొందుపరచుకోవాలో వివరించారు. తర్వాత విద్యార్థులు ఇంటర్వ్యూకు ఎలాసిద్ధమవ్వాలో తెలియజేసారు. ఇంటర్వ్యులో విద్యార్థులను కష్టతరమైన ప్రశ్నలనుఏమి అడగబోమన్నారు. విద్యార్థి యూఎస్ కు వెళ్లడానికి మానసికంగా, ఆర్ధికంగాఎలా సిద్ధమయ్యాడో పరీక్షిస్తామన్నారు. విద్యార్థులు యూఎస్ కి వచ్చేటప్పుడుతీసుకోవాల్సిన సెక్యూరిటీ టిపను వెల్లడించారు. విద్యార్థులు ఐ-20 డాక్యుమెంట్ నుతప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. ఒకవేళ విద్యార్థి ఇంటర్వ్యూలో విఫలమైతేఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు.

మరొకసారి ఇంటర్వ్యూ కోసం దరఖాస్తుచేసుకోవచ్చన్నారు. ఇంటర్వ్యూ పూర్తిచేసిన విద్యార్థులకు 60 రోజులలోపేఅడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ పూర్తవుతుందన్నారు. వీసా పొందిన విద్యార్థులు కాలపరిమితిముగియకముందే రెన్యువల్ చేసుకోవాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మరొకయూఎస్ కాన్సులేట్ మెంబర్ సునీత తన్నేరు మాట్లాడుతూ అమెరికా వెళ్లాలనుకునేవిద్యార్థులు తమకున్న సందేహాలను నివృత్తి చేసుకొనుటకు కన్సల్టెన్సీల మీదఆధారపడకుండా యూఎస్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌నుసంప్రదించవచ్చునని తెలిపారు. అక్కడ టీచింగ్ అసిస్టెంట్ షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ పొందటానికి విద్యార్థులు ఎంచుకోవాల్సిన పద్దతులను తెలియజేసారు.కార్యక్రమంలో విద్యార్థులు వారివారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories