Tuni: శ్రీ ప్రకాష్ లో దివీస్ లేబరేటరీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు

Tuni: శ్రీ ప్రకాష్ లో దివీస్ లేబరేటరీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు
x
Highlights

స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల లో దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు శనివారం నిర్వహించారు.

తుని: స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల లో దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు శనివారం నిర్వహించారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలకు విశాఖ , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల నుండి బి.ఎస్ సి, ఎం.ఎస్సి కెమిస్ట్రీ చదువుతున్న 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

దివీస్ లేబరేటరీస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ జి.శరత్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దివీస్ కంపెనీ గురించి పూర్తిగా వివరించారు. అందులో భాగంగా సంస్థలో పని చేయుటకు కావలసిన నియమ నిబంధనలు మరియు సెలక్షన్ ప్రక్రియ వివరించారు. తదుపరి సెలక్షన్ ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు రాత పరీక్షలు నిర్వహించి సెలెక్ట్ అయిన విద్యార్థులకు హెచ్.ఆర్. రౌండ్, టెక్నికల్ రౌండ్ లను నిర్వహించడమైనది. ఎంపిక ప్రక్రియను విజయవంతముగా పూర్తి పూర్తి చేశారు. వీరిలో 93 మంది దివీస్ లో పనిచేయుటకు అర్హత సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వీర్రాజు తెలియజేశారు.

ఎంపికైన విద్యార్థులను కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సిహెచ్.వి కె.నరసింహారావు, సహాయ కార్యదర్శి సి.హెచ్. విజయ్ ప్రకాష్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఎం.సాయి కృష్ణ, ఎ. రాజేష్, టెక్నికల్ ఎగ్జిక్యూటివ్స్ డి.శరత్, పి.ఆకాష్ , వైస్ ప్రిన్సిపల్ పెనుగొండ సుబ్బారావు, కెమిస్ట్రీ హెచ్.ఓ.డి. వి.శివ గంగాధర్, డాక్టర్ ఎ. కె. త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories