ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి
x
Highlights

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మర్రిపాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రిలోని రికార్డులను, మందులను పరిశీలించారు. ఆస్పత్రిలోని సిబ్బంది విధులకు క్రమం తప్పకుండా వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రిలోని వసతులను ఆమె పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్న రాలేదని రోగులను అడిగి తెలుసుకున్నారు.

మండలంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 6 ప్రాథమిక ఉప కేంద్రాలను హెల్త్ అండ్ వెల్ సెంటర్లుగా తీర్చి దిద్దనున్నమని తెలిపారు. ప్రస్తుతం సీజన్కుకు కావలసిన మందులన్నీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైద్యాధికారి వెంకట కిషోర్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories