ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
x
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అక్కి భాస్కర్ రెడ్డి, అలీ అహ్మద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
Highlights

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను, సోమవారం ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు.

ఉదయగిరి:ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను, సోమవారం ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎంపీడీఓ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 8 మండలకు సంబంధించి, 23 మంది బాధితులకు 1,56,0000 రూపాయలు అందజేశారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... వైయస్ జగన్ మోహన్ రెడ్డి, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకి, సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధి విడుదల చేయడంతో, ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

పార్టీలకతీతంగా అనారోగ్యంతో ఉన్న ఎవరైనా, ముఖ్యమంత్రి సహాయనిధి అప్లై చేసుకున్న వారికి వెంటనే, సహాయనిధి విడుదలవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్కి భాస్కర్ రెడ్డి, అలీ అహ్మద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories