ప్రకాశం జిల్లాలో ఇరు గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం

ప్రకాశం జిల్లాలో ఇరు గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం
x
Highlights

చేపల వేట విషయంలో రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది. ఒక గ్రామంపై మరో గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. గత మూడు రోజులుగా ప్రకాశం జిల్లా సముద్ర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.

చేపల వేట విషయంలో రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది. ఒక గ్రామంపై మరో గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. గత మూడు రోజులుగా ప్రకాశం జిల్లా సముద్ర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ప్రకాశం జిల్లా సముద్ర ప్రాంతాల్లోని మత్స్యకారులు బల్ల వలను వాడకూడదని ఒక కట్టుబాటు విధించుకున్నారు. దీనికి విరుద్ధంగా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన మత్స్చకారులు చేపల వేట కోసం బల్ల వలను వాడుతున్నారు. దీని వల్ల సముద్రంలో మత్స్య సపంద సర్వనాశనమైపోతుందని కఠారిపాలెంతో పాటు మరో 75 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. పదిరోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ పరిష్కారం చూపకపోవడంతో వాడరేవు మత్స్కకారులు తిరిగి యధావిధిగా బల్ల వల వినియోగిస్తూ చేపల వేట చేసారు. దీంతో మళ్లీ ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తమ గ్రామంలో అక్రమంగా ప్రవేశించి తమ వారిపై తీవ్రంగా దాడి చేసారని వాడరేవు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐతే, బల్ల వల వాడకుండా చేపల వేట కొనసాగిస్తే, తమకెలాంటి అభ్యంతరం లేదని, అందరూ కలిసి కట్టుగా పని చేసుకోడానికి తాము సిద్ధమని కఠారిపాలెం మత్స్యకారులు అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని వివాదం ఇంతటితో ఆగి, ప్రశాంతంగా తమ జీవనం కొనసాగినట్లు చూడాలని చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories