నేడు ఏపీ వృద్ధిరేటు పెంపు ప్రణాళికపై చర్చ

నేడు ఏపీ వృద్ధిరేటు పెంపు ప్రణాళికపై చర్చ
x
Highlights

ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు సచివాలయం ఐదో బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్షా సమావేశం జరుగనుంది.

అమరావతి : ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు సచివాలయం ఐదో బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్షా సమావేశం జరుగనుంది. రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చ జరుగుతుంది. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్సు అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమావేశంలో చర్చిస్తారు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రభుత్వం అందించే పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపై చర్చిస్తారు. ఫైళ్ల క్లియరెన్సు, ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్ల పై సమావేశంలో ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై హెచ్ఓ డీలకు సీఎం సూచనలు చేస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ఫలితాలను సమీక్షిస్తారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలు, వాటి రీస్ట్రక్చరింగ్ అంశంపై శాఖల వారీగా సమీక్షిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories