మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు

మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు
x
Highlights

ఏపీలో మూడు రాజధానుల అంశం టీడీపీని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. జగన్ వ్యాఖ్యలను కొందరు టీడీపీ నేతలు తప్పక స్వాగతించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే క్రమంలో...

ఏపీలో మూడు రాజధానుల అంశం టీడీపీని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. జగన్ వ్యాఖ్యలను కొందరు టీడీపీ నేతలు తప్పక స్వాగతించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే క్రమంలో కర్నూల్, విశాఖ ప్రాంతాల వారు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొదట్లో గంటా శ్రీనివాసరావు, ఆ తరువాత కెఇ కృష్ణమూర్తి, నిన్న కొండ్రు మురళి కూడా టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే జాబితాలో చేరిపోయారు. వీరంతా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశాన్ని సమర్థిస్తున్నారు. దీంతో అధిష్టానానికి ఇదో పెద్ద తలనొప్పిలా మారింది. ఒక పక్క అమరావతిలోని మొత్తం రాజధానిని నిర్మించాలని టీడీపీ నిర్ణయిస్తే.. కొందరు నేతలు మాత్రం ఇందుకు బిన్నంగా మాట్లాడుతున్నారు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన మరి కొందరు నేతలు మాత్రం అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు.

అందులో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన భరత్ అయితే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలనే ఆలోచన తప్పు అనే విధంగా మాట్లాడారు. వాస్తవానికి భరత్ విశాఖకు చెందిన నేతే అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే జిల్లాకు చెందిన టీడీపీ నేతలు.. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత లైతే జగన్ ది తుగ్లక్ చర్య అని విమర్శిస్తున్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సీఎం వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని అని మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆరోపించారు. ఫరూక్ వాస్తవానికి కర్నూలు జిల్లాకు చెందిన వారే అయినా.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశయం అయింది. ఇలా టీడీపీలో ఎవరి దారి వారిది అన్నట్టుగా మాట్లాడుతుండటంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొన్నట్లయిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories