'ఢమరుకం' సినిమా దర్శకుడికి సీఎం జగన్ కీలక పదవి

ఢమరుకం సినిమా దర్శకుడికి సీఎం జగన్ కీలక పదవి
x
Highlights

'ఢమరుకం' సినిమా దర్శకుడికి సీఎం జగన్ కీలక పదవి 'ఢమరుకం' సినిమా దర్శకుడికి సీఎం జగన్ కీలక పదవి

టాలీవుడ్‌ దర్శకుడు శ్రీనివాస రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను 'తిరుమల శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు' డైరెక్టర్ పదవికి ఎంపిక చేసినట్టు ఏపీ ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ స్వప్నను కూడా డైరెక్టర్‌గా జగన్ సర్కార్ ఎంపిక చేసింది. సినీ రంగానికే చెంది, వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు ఛానల్ చైర్మన్‌గా ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

తాజాగా శ్రీనివాస్ రెడ్డికి డైరెక్టరుగా బాధ్యతలు అప్పగించడం విశేషం. శ్రీనివాస్ రెడ్డి ఎంపిక పట్ల ఆయన మిత్రబృందంతో ఏర్పడ్డ 'ఫ్లయింగ్ కలర్స్' అభినందించింది. కాగా శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి.. టీటీడీలో రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించిన సీఎం జగన్ అందులో భాగంగానే శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. త్వరలో అయన svbc డైరెక్టర్ గా పదవీబాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఆయన బొమ్మనా బ్రదర్స్ చందాన సిస్టర్స్, అ ఆ ఈ ఈ, డమరుకం, శివమ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా టీటీడీలో కీలక పదవి ఆశించినట్టు వార్తలు వచ్చాయి. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ద్వారా మంతనాలు సాగించినట్టు ప్రచారం జరిగింది. టీటీడీ ధర్మకర్తల మండలిలో ఆయన స్థానం కోసం ప్రయత్నించారు.. అయితే సామాజిక కారణాలతో దిల్ రాజుకు అవకాశం దక్కలేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories