ఆయన కారణంగా బూచేపల్లి ఇబ్బందులు పడుతున్నాడా?

ఆయన కారణంగా బూచేపల్లి ఇబ్బందులు పడుతున్నాడా?
x
Highlights

గత ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఆ ఓటమి చెందారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేద్దామంటే కుటుంబసభ్యులు వద్దన్నారు. దాంతో చేసేదేమి లేక మరో నేతను...

గత ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఆ ఓటమి చెందారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేద్దామంటే కుటుంబసభ్యులు వద్దన్నారు. దాంతో చేసేదేమి లేక మరో నేతను తీసుకొచ్చి పోటీ చేయించారు. తీరా ఆ నేత గెలిచాక మేకై కూర్చున్నాడట ఇంతకీ ఎవరా నేత? ఏమా కదా అనుకుంటున్నారా? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. బూచేపల్లి కుటుంబానికి దర్శిలోనే కాక సంతనూతలపాడులో కూడా బలమైన క్యాడర్ ఉంది. రెండు నియోజకవర్గాల్లో బూచేపల్లి ఫ్యామిలీ ఎవరికి చెబితే వారికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అటువంటి బలమైన రాజకీయ నేపధ్యం నుంచి వచ్చిన శివప్రసాద్ రెడ్డి.. 2009 లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలో 2014 లో పోటీ చేశారు. అయితే 700 వందల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత గ్రానైట్ వ్యాపారాలకే పరిమితమయ్యారు.

ఆయన తండ్రి సుబ్బారెడ్డి 2004 లో దర్శి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2014 సాధారణ ఎన్నికల తరువాత సుబ్బారెడ్డి అనారోగ్యానికి గురయ్యారు(ఇటీవల కాలం చేశారు). దాంతో 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనని శివప్రసాద్ రెడ్డి వైసీపీ అధిష్టానానికి తేల్చి చెప్పారు. అదేక్రమంలో మద్దిశెట్టి వేణుగోపాల్ కు టికెట్ ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించారు. వైసీపీ కూడా శివప్రసాద్ రెడ్డికి నిర్ణయానికే ఒకే చెప్పింది. గడిచిన ఎన్నికల్లో మద్దిశెట్టి దర్శి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన గెలవడానికి బూచేపల్లి కుటుంబం తీవ్రంగా శ్రమించింది. అయితే అంతా చేసి ఎన్నికల్లో గెలిపిస్తే మద్దిశెట్టి పట్టించుకోవడం లేదని బూచేపల్లి క్యాడర్ ఆరోపిస్తోందట. అధికారిక కార్యక్రమంలో కనీసం పిలుపు కూడా లేదని బూచేపల్లి క్యాడర్ మధనపడిపోతోందట. అయితే అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందని.. ఇందులో మిగతా వారికి భాగస్వామ్యం లేదు కాబట్టే బూచేపల్లిని పిలవడం లేదని.. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఆయన తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని మద్దిశెట్టి క్యాడర్ చెబుతోందట. మరి ఈ పిలుపుల రాజకీయం ఎటువైపు మళ్లుతుందో వేచి చూడాలి

#

Show Full Article
Print Article
More On
Next Story
More Stories