Visakhapatnam: జనసేన ధర్నా.. జంక్షన్ వద్ద గోడను తొలగించాలని డిమాండ్

Dharna Under Jana Sena In Visakhapatnam
x

Visakhapatnam: జనసేన ధర్నా.. జంక్షన్ వద్ద గోడను తొలగించాలని డిమాండ్

Highlights

Visakhapatnam: ధర్నాలో పాల్గొన్న జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

Visakhapatnam: విశాఖలో జనసేన నేతలు ధర్నా చేపట్టారు. టైకూన్ జంక్షన్ వద్ద రోడ్డు మూసివేతకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జనసేన కార్యకర్తలతో కలిసి నాదెండ్ల మనోహర్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. జనసేన కార్యకర్తల నిరసన పిలుపుతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై నిరసనకు దిగిన జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన గోడను తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వానికి సవాల్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories