గ్రామ వాలంటీర్ కు అభినందనల వెల్లువ

గ్రామ వాలంటీర్ కు అభినందనల వెల్లువ
x
Highlights

గ్రామ వాలంటీర్ కు అభినందనల వెల్లువ గ్రామ వాలంటీర్ కు అభినందనల వెల్లువ

స్పృహ కోల్పోయిన ఒక అనాధ వ్యక్తిని చేరదీసి 108 వాహనం లోకి ఎక్కించి అతనికి సపర్యలు చేసిన ధర్మసాగరం గ్రామ వాలంటీర్ బోయాలమ్మకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె చేసిన ఈ పనికి పలువురు ఎమ్మెల్యేలు,ఎంపీలు బోయాలమ్మ గొప్ప మనసున్న వాలంటీర్ అని అభినందిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మసాగరం గ్రామానికి చెందిన వృద్ధుడికి ఎవరు లేక నిరాదరణకు గురయ్యారు. అయితే ఇటీవల ఆరోగ్యం మరింత విషమించింది. ఒంట్లో సత్తువ లేక కనీసం మాట్లాడే ఓపిక కూడా లేని ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

దాంతో విషయం తెలుసుకున్న గ్రామ వాలంటీర్ బోయాలమ్మ 108 వాహనానికి సమాచారం అందించారు. ఈ క్రమంలో సదరు వృద్ధుడికి సపర్యలు చేసి.. వాహనంలో ఆయనను ఆసుపత్రికి తరలించడంలో సహపడ్డారు. వాస్తవానికి మొదట్లో గ్రామ వాలంటీర్ర్లపై విమర్శలు వచ్చాయి. అంతెందుకు ఇటీవల ప్రతిపకనేత చంద్రబాబు కూడా.. గ్రామ వాలంటీర్లు పురుషులు ఇంట్లో లేని సమయంలో తలుపు కొడుతున్నారని విమర్శించిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. కొంతమంది సేవా దృక్పధంతో గ్రామ వాలంటీర్లు ఎంపికయ్యారు.. ఆ కోవకు చెందిన వారిలో ఈ వాలంటీర్ కూడా ఉన్నారని ఆమె చేసిన పని చూస్తేనే అర్ధమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories