ఏపీలో ఆరు శాతం నేరాలు తగ్గుముఖం : డీజీపీ

ఏపీలో ఆరు శాతం నేరాలు తగ్గుముఖం : డీజీపీ
x
Highlights

ఈ ఏడాది గతంతో పోలిస్తే ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.....

ఈ ఏడాది గతంతో పోలిస్తే ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఏడాదికి సంబంధించిన క్రైమ్ రిపోర్టును బయటపెట్టారు. గతం కంటే ఈసారి క్రైం రేట్ తగ్గిందని.. ఇది మంచి పరిణామం అని అన్నారు. కేవలం రెండు జిల్లాలకే (విశాఖ,తూర్పు) మావోయిస్ట్‌ కార్యకలాపాలు పరిమితమయ్యాయని తెలిపారు. గుట్కా, ఇసుక, బెల్టుషాపులు, గంజాయిపై ఉక్కుపాదం మోపామని తెలిపారు. అలాగే జూదం, పేకాట క్లబ్‌లను దాదాపు అన్ని ఏరియాల్లో మూసివేసినట్టు పేర్కొన్నారు. ఏపీలో మహిళాభద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పిన సవాంగ్.. మహిళా భద్రతకోసం ఈ ఏడాది నుంచే దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

గ్రామాల్లో దాడులు జరగకుండా పోలీసు వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు వెల్లడించారాయన. సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీని ద్వారా పోలీసు స్టేషన్ గడప తొక్కకుండానే కేసులు పరిష్కారం అవుతున్నాయని డీజీపీ తెలిపారు. ఏపీలో అన్ని పోలీస్‌స్టేషన్లలో జీరో శాతం ఎఫ్‌ఐఆర్‌ ను నమోదు చెయ్యాలని ఆదేశించినట్టు తెలిపారు.జాతీయస్థాయిలో ఏపీ పోలీసులకు గుర్తింపు వచ్చిందని.. స్కోచ్‌, డీఎస్‌సీఐ జీ ఫైల్స్‌కు సంబంధించి ప్రధాని మోదీ ప్రశంసించారని గుర్తుచేశారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లను అమలు చేసిన చరిత్ర ఏపీ ప్రభుత్వానిదే అని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories