దేశంలో తొలిసారి దిశ పోలీస్ స్టేషన్.. పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు

దేశంలో తొలిసారి దిశ పోలీస్ స్టేషన్.. పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు
x
Highlights

మహిళా రక్షణకు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'దిశ' విభాగం ఏర్పాటు చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా...

మహిళా రక్షణకు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'దిశ' విభాగం ఏర్పాటు చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లారు. రాష్ట్రంలో ప్రతి పోలీసుస్టేషన్‌ మహిళా మిత్రలా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. మహిళలపై దాడులు, దిశ కేసుల్లో వేగవంతమైన విచరణ కోసం అవసరమైన యంత్రాంగాన్ని సమకురుస్తున్నామని సవాంగ్ చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్‌ల్లో ఇద్దరు 38 కానిస్టేబుళ్లు సహా, ఇద్దరేసి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఉంటారని తెలిపారు.

దిశ కేసుల్లో 7 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి బాధిత మహిళలకు న్యాయం చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 7న సీఎం వైఎస్ జగన్‌‌ 'దిశ యాప్' కూడా ప్రారంభిస్తారని వెల్లడించారు. దిశ కేసుల్లో మాత్రమే కాకుండా మహిళలకు సంబంధించిన ఏ కేసులైనా త్వరగా పరిష్కరించే విధంగా పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా బాధితులకు సత్వర న్యాయం చేస్తామని గౌతమ్ సవాంగ్ చెప్పారు.

మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏపీ దిశ యాక్ట్‌ అసెంబ్లీ ముందుకు వచ్చింది. హౌస్‌లో హోంమంత్రి సుచరిత బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో మహిళలందరికీ జగనన్న ఒక రక్ష - ఎవరైనా మహిళలపై చెయ్యి వేస్తే పడుతుంది కఠిన శిక్ష అని వ్యాఖ్యానించారు. ఈ చట్టంతో ఏదైనా నేరం జరిగితే, నేరస్తులు నిర్భయంగా సమాజంలో తిరిగే పరిస్థితి ఉండదని, 14 రోజుల్లో విచారణ పూర్తయి, 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు భరోసాను కల్పించేలా ఈ చట్టం ఉండనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories