ఏపీలో ఎక్కడికైనా వెళ్లొచ్చు..అనుమతులు అవసరం లేదు: డీజీపీ

ఏపీలో ఎక్కడికైనా వెళ్లొచ్చు..అనుమతులు అవసరం లేదు: డీజీపీ
x
DGP Gautam Sawang (File photo)
Highlights

లాక్ డౌన్ నాలుగో దశ మినహాయింపుల్లో ఏపీలో ప్రజలకు ఉపశమనం లభించినట్లే.

లాక్ డౌన్ నాలుగో దశ మినహాయింపుల్లో ఏపీలో ప్రజలకు ఉపశమనం లభించినట్లే. రాకపోకలకు విషయంలో అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఏపీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్లవచ్చు. అలాగే తమ వాహనాల్ని కూడా తీసుకెళ్లవచ్చు. ఇందుకు ఎలాంటి అనుమతి పత్రాలూ చూపించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపవద్దని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలవుతాయని చెప్పారు.

తెలంగాణ సహా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి రావాలంటే మాత్రం అనుమతి ఉండాల్సిందే. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్న.. ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories