Tirumala: పున్నమి వెన్నెల్లో గోవిందుని వైభవాన్ని కళ్లారా తిలకించిన భక్తులు

Devotees Who Gazed At The Glory Of Govindu In The Full Moon
x

Tirumala: పున్నమి వెన్నెల్లో గోవిందుని వైభవాన్ని కళ్లారా తిలకించిన భక్తులు

Highlights

Tirumala: తిరువీధుల్లో గరుత్మంతునిపై విహరించిన మలయప్పస్వామి

Tirumala: తిరుమలలో శ్రీవారి పౌర్ణమి గరుడసేవ నేత్రపర్వంగా జరిగింది. ఆషాఢ మాస పౌర్ణమి సందర్భంగా స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై నాలుగు మాడావీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు... స్వామివారు ప్రతిరూపమైన మలయప్పస్వామి బంగారు గరుడుడుని అదిరోహించి తిరువీధుల్లో విహరిస్తూ... భక్తులను ఆశీర్వదించారు. పున్నమి వెన్నెల్లో గోవిందుని వైభవాన్ని కళ్లారా తిలకించిన భక్తులు పరవశించిపోయారు. స్వామివారి సేవలో ముందు గజరాజులు నడువగా, మహిళల కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కూడల్లో స్ధానికులు సమర్పించే కర్పూర హారతులతో నడుమ తిరుమలేశుని పౌర్ణమి గరుడ వాహన సేవ కన్నులపండువగా సాగింది. వేలాది మంది భక్తులు, స్ధానికలు, ఉద్యోగులు, అధికారులు స్వామివారి వాహన సేవలో భాగస్వామ్యమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories