Vijayawada: విజయవాడ దుర్గ గుడిలో భక్తులపై సిబ్బంది దౌర్జన్యం

Devotees Brutalized By Staff In Vijayawada Durga Temple
x

Vijayawada: విజయవాడ దుర్గ గుడిలో భక్తులపై సిబ్బంది దౌర్జన్యం

Highlights

Vijayawada: ఛైర్మన్ అనుచరులను మాత్రమే లిఫ్ట్‌లో తీసుకెళ్లారని భక్తుల ఆరోపణ

Vijayawada: విజయవాడ దుర్గగుడిలో భక్తులపై ఆలయ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. ఛైర్మన్ లిఫ్ట్‌ దగ్గర భక్తులను బలవంతంగా దింపించేసి.. ఛైర్మన్ అనుచరులను మాత్రమే లిఫ్ట్‌లో తీసుకెళ్లారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ సిబ్బంది ఛైర్మన్ సేవలకే పరిమితమయ్యారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారిని కొండపైనే వదిలేశారని ఆరోపించారు. రాజకీయ నాయకులు, పార్టీలకు దుర్గగుడి ఓ వసతి కేంద్రంలా మారిందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చుచేసి లిఫ్టులు ఏర్పాటు చేసినా సామన్య భక్తులకు మాత్రం అనుమతించడంలేదని వాపోతున్నారు. సిబ్బంది చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు భక్తులు. భక్తుల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రైవేట్ సిబ్బంది బూతుపురాణం మొదలుపెట్టారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories