Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో అస్వస్థతకు గురై ఓ భక్తుడు మృతి

Devotee dies after falling ill at Srisailam Temple
x

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో అస్వస్థతకు గురై ఓ భక్తుడు మృతి

Highlights

Srisailam: సాక్షి గణపతి ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా అస్వస్థత

Srisailam: శ్రీశైలం మహాక్షేత్రంలో ఓ భక్తుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. హైదరాబాద్‌లోని బౌరంపేటకు చెందిన సురేష్ ప్రసాద్ కుటుంబంతో కలిసి సోమవారం సాయంత్రం శ్రీశైలంలో స్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీశైలంలోని సాక్షిగణపతి ఆలయ దర్శనం కోసం వెళ్లారు. అయితే అకస్మాత్తుగా వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని మృతుడి భార్య తెలిపారు.

అయితే చికిత్స కోసం శ్రీశైలంలోని ప్రాథమిక వైద్యశాలకు తీసుకెళ్తే అక్కడ సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపించారు. సుమారు గంటపాటు హాస్పిటల్ బయటే వేచి ఉన్నామని.. పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. సకాలంలో వైద్యులు స్పందించి ఉంటే తన భర్త ప్రాణాలతో ఉండేవాడని కన్నీటి పర్యంతమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories