వైసీపీ ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకు చేరింది: దేవినేని ఉమ

వైసీపీ ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకు చేరింది: దేవినేని ఉమ
x
Highlights

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై జగన్ ప్రభుత్వం సిట్ వేయడంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు.

ఇబ్రహీంపట్నం: చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై జగన్ ప్రభుత్వం సిట్ వేయడంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని, అది కూడా హత్య కేసులను విచారణ చెయ్యాల్సిన పోలీసులతో సిట్ వేశారని విమర్శించారు. శనివారం నాడు మండలంలోని దాములూరు గ్రామంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం పిచ్చి పరాకాష్ట కు చేరిందని, వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, టీడీపీపై బురదజల్లడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. పోలీసులతో సిట్ వేయడం రాజకీయ కక్ష సాదింపేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో భయపడేది ఏమి లేదని స్పష్టం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే వసంతకు ఛాలెంజ్ విసురుతూ కొటికలపూడి (కృష్ణా నది)లో ఎమ్మెల్యే వసంత అనుచరులు ఇసుక మాఫియా, రోజుకు 200 ట్రాక్టర్లతో లోడింగ్ స్టాక్ పాయింట్ చేసి హైదరాబాద్ లో కోట్లలో వ్యాపారం గడిస్తున్నది వాస్తవం కాదా? అని దీనిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్ అధికారులు కూడా దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories