జగన్‌ కళ్లల్లో ఆనందం చూసేందుకే అలా మాట్లాడుతున్నారు : దేవినేని ఉమ

జగన్‌ కళ్లల్లో ఆనందం చూసేందుకే  అలా మాట్లాడుతున్నారు : దేవినేని ఉమ
x
Devineni UMA File Photo
Highlights

చంద్రబాబుపై విమర్శలు చేయందే ఆ పార్టీ నేతలకు నిద్రపట్టడం లేదని విమర్శించారు.

సీఎం వైఎస్ జగన్‌ కళ్లల్లో ఆనందం చూసేందుకే ఆ పార్టీ నేతలు, మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. చంద్రబాబుపై విమర్శలు చేయందే ఆ పార్టీ నేతలకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడారు. అమరావతి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నాటకాలు ఆడుతుందని విమర్శించారు. ఐటీ దాడులు జరిగిన 3 ఇన్‌ఫ్రా కంపెనీల విషయం బొత్స ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

మంత్రి బొత్స రాజకీయాల్లో తనకంటే జూనియర్‌ అయిన సీఎం జగన్‌ ముందు చేతులు కట్టుకుని ఉంటున్నారని. అలా అవమానంగా ఉండే కంటే ధైర్యంగా నిజాలు చెప్పాలని పేర్కొన్నారు. బొత్స కేంద్రంతో సయోద్య విషయంలో రోజుకో మాట ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. బొత్స ఒకరోజు వివరణ, ఖండన అంటూ మాట్లాడుతున్నారో ఆయనకేనా అర్థం అవుతుందా అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై ఐటీ దాడుల్లో ఆ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వైసీపీ నేతలు ముఖం చాటేస్తున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. రూ.2వేల కోట్లు అంటూ పదేపదే మాట్లాడుతున్నారని, ప్రజా సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం సీఎం, మంత్రులకు పట్టదా అని నిలదీశారు. జై అమరావతి అని శాతియుతంగా ఉద్యమం చెస్తూ గులాబీలు ఇచ్చిన యువకులపై కేసులు పెట్టారన్నారు. అక్రమ కేసులు, హైకోర్టు మొట్టికాయలు వేసిందని ఆయన ప్రభుత్వం తీరులో మార్పు రావడం లేదని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్ను విశాఖలోని వెంకోజీపాలెం జ్ఞానానంద ఆశ్రమంపై పడిందని దేవినేని ఆరోపించారు. ఆశ్రమానికి చెందిన 6.5 ఎకరాల భూములను స్వాహా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విశాఖ భూములు కబ్జా చేసేందుకే వెళ్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories