తెలుగుదేశం వెబ్ సమీక్షల పార్టీనే.. వైఎస్ జగన్ తండ్రి ఆశయాలను వారసత్వంగా పుచ్చుకున్నారు : దేవినేని అవినాష్

తెలుగుదేశం వెబ్ సమీక్షల పార్టీనే.. వైఎస్ జగన్ తండ్రి ఆశయాలను వారసత్వంగా పుచ్చుకున్నారు : దేవినేని అవినాష్
x
Devineni Avinash (File Photo)
Highlights

జగన్ ఏడాది పాలనలో ఎనలేని అభివృద్ధి జరిగిందని అన్నారు.

జగన్ ఏడాది పాలనలో ఎనలేని అభివృద్ధి జరిగిందని అన్నారు. ఏడాదిలో మానిఫెస్టోని అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్. పార్టీల కతీతంగా అన్నివర్గాల అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్ మాత్రమే సొంతం అని అన్నారు.

ముఖ్యమంత్రి చేపడుతున్న పధకాలతో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూసేలా ఉన్నాయని, కృష్ణలంక వాసుల చిరకాల వాంఛ తీర్చేందుకు 120 కోట్లు కేటాయించారని అన్నారు.

సీఎం ఆశీస్సులతో రిటైనింగ్ వాల్ పూర్తయితే వరద కష్టాలు తీరిపోతాయని అన్నారు. నియోజకవర్గం లో పదికోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని దేవినేని అవినాష్ తెలిపారు.

సీఎం ఏడాదిలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకి విస్తృత ప్రచారం కల్పిస్తామని, ఐదేళ్లల్లో టీడీపీ ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పనులు చేస్తుంటే మోకాళ్ళు అడ్డుతున్నారు. టీడీపీ కుట్రలు ,కుతంత్రాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అవినాష్ ధ్వజమెత్తారు.

కరోనా కష్టకాలంలో పేదలకు కష్టం కలగకుండా చేసి పాలనాదక్షతను సీఎం చాటుకొన్నారని చెప్పారు. కరోనా సమయంలో పారిపోయిన టీడీపీ జూమ్ యాప్ కాన్ఫరెన్స్ లకే పరిమితమైందని, భవిష్యత్తులో తెలుగుదేశం వెబ్ సమీక్షల పార్టీ గానే మిగిలిపోతుందని జ్యోస్యం చెప్పారు.

జగన్ నేతృత్వంలో పాలన దివంగత వైఎస్ఆర్ పాలనను మరిపించేలా ఉంది..అందరూ ఆస్తులను వారసత్వంగా తీసుకొంటే వైఎస్ జగన్ తండ్రి ఆశయాలను లక్శ్యంగా చేసుకొన్నారని దేవినేని అవినాష్ అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories