ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపడతాం

ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపడతాం
x
Highlights

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాడిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

తుని: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాడిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తుని మండలం వల్లూరు, చామవరం గ్రామాల్లో సోమవారం ఆయన వైసీపీ నేతలతో కలిసి పర్యటించారు. చామవరం లో గ్రామ సచివాలయ భవనానికి శంకుస్థాపన చేసిన దాడిశెట్టి శ్రీనివాస్ వల్లూరులో రూ.40 లక్షలతో నిర్మించే రక్షిత మంచినీటి పథకానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గడపగడపకు ప్రభుత్వ పాలన అందించేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించేందుకు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం స్వచ్ఛమైన త్రాగు నీటిని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలిశెట్టి సోమరాజు, సకురు నాగేంద్ర నెహ్రూ, దేవరపు సూర్య చక్రం, పోతల రమణ, రేలంగి రమణ గౌడ్, పోతుల లక్ష్మణ్, బొప్పన రాము, బొప్పన సుకన్య తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories