TDP Mahanadu: ఘనంగా టీడీపీ మహానాడు వంటల ఘుమఘుమలు

Delicious Food Items in TDP Mahanadu
x

TDP Mahanadu: ఘనంగా టీడీపీ మహానాడు వంటల ఘుమఘుమలు

Highlights

TDP Mahanadu: టీడీపీ మహానాడు ఫుడ్ మెనూ

TDP Mahanadu: రాజమహేంద్రవరంలో ఘనంగా టీడీపీ మహానాడు జరుగుతోంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మరోవైపు మహానాడుకి విచ్చేయబోతున్న అతిథులకి నోరూరించే వంటకాల్ని టీడీపీ సిద్ధం చేస్తోంది.దాదాపు 3,500 మంది సిబ్బందితో 6 లక్షల మందికి.. 200 వంటకాల్ని అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు..ఈ గోదావరి వంటకాలను తెలుగు తమ్ముళ్లు టేస్ట్ చూడబోతున్నారు.

టిఫిన్ కింద ఇడ్లీ, వడ, మైసూర్ భజ్జీతో పాటు పునుగులు, పొంగల్, టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ రెడీ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో వెజ్ బిర్యానీ, బంగాళదుంప కుర్మా, మామిడికాయ పప్పు, గోంగూర, గుత్తు వంకాయ, సాంబారు, పెరుగు అలానే మజ్జిగ పులుసుని కూడా వడ్డించబోతున్నారు. అదనంగా కాకినాడ కాజా, యాపిల్ హల్వా, తాపేశ్వరం గొట్టం కాజా కూడా అతిథులకి వ‌డ్డించ‌నున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories