బాహుబలి వంతెనకు బిల్లులందక పనులలో జాప్యం

బాహుబలి వంతెనకు బిల్లులందక పనులలో జాప్యం
x
Highlights

మండల కేంద్రంలో బాహుబలి వంతెనగా పేరొందిన కుడుము సారె వంతెన పనులు జాప్యంగా జరుగుతున్నాయి.

చింతపల్లి: మండల కేంద్రంలో బాహుబలి వంతెనగా పేరొందిన కుడుము సారె వంతెన పనులు జాప్యంగా జరుగుతున్నాయి. గడచిన కొన్నేళ్ల క్రితం కుడుముసారె పంచాయతీకి చెందిన చిన్నారికి ఆరోగ్యం బాగోలేని స్థితిలో ఆసుపత్రికి తీసుకువెళ్ళేందుకు సైతం సరైన రహదారి, రవాణా, కనీసం తాత్కాలిక వంతెన సదుపాయం లేని పరిస్థితి. పెద్ద కాలువలో గ్రామానికి చెందిన ఒక సాహసి ఆ చిన్నారిని చేతబట్టుకుని బాహుబలి రూపంగా ఈదుకుంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్లు పత్రికలలో ప్రచురితమైన వార్తకు అప్పటి ప్రభుత్వం స్పందించింది.

అధికారులు రెండే రెండు మాసాలలో హుటాహుటిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి మూడు కోట్ల తొంబై లక్షల గ్రాంటును విడుదల చేశారు. నాడు పాలకులు, అధికారులు అట్టహాసంగా దృష్టి కేంద్రీకరించి ప్రారంబించిన కుడుముసారె వంతెన పనులు ఆ తరువాత బిల్లుల జాప్యంతో పనులలోనూ నత్తనడకన సాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే ఆ పంచాయతీలోని సుమారు ఇరవై గ్రామాల గిరిజన ప్రజలకు ఉపయోగకరం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబందిత ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు స్పందించి బాహుబలి వంతెన నిర్మాణ పనుల బిల్లులు మంజూరు చేయాలని గుత్తేదారు కోరుతున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories