నా భార్యను నడిరోడ్డుపై ఉరితీయాల్సిందే... చిన్నారి దీప్తి తండ్రి ఆవేదన!

నా భార్యను నడిరోడ్డుపై ఉరితీయాల్సిందే... చిన్నారి దీప్తి తండ్రి ఆవేదన!
x
Highlights

తనకూ, తన బిడ్డకు తోడుగా ఉంటుందని వివాహం చేసుకుంటే ఆఖరికి తన భార్య.. కూతురుని తిరిగిరాని లోకాలకు పంపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు దీప్తిశ్రీ తండ్రి...

తనకూ, తన బిడ్డకు తోడుగా ఉంటుందని వివాహం చేసుకుంటే ఆఖరికి తన భార్య.. కూతురుని తిరిగిరాని లోకాలకు పంపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు దీప్తిశ్రీ తండ్రి సూరాడ సత్యశ్యామ్. తన రెండో భార్య చేసిన ఈ ఘాతుకానికి ఆమెను నడిరోడ్డుమీద నిలువునా ఉరితీయాలని అన్నాడు. తానెంతో ప్రేమగా చూసుకునే బిడ్డను కర్కశంగా హత్య చేసిన ఆమెకు కఠిన శిక్ష పడాల్సిందేనంటున్నాడు. కాకినాడ సమీపంలో చిన్నారి దీప్తిని సవతి తల్లి శాంతికుమారి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న దీప్తి చదువుతున్న స్కూల్ కు వెళ్లిన శాంతికుమారి, ఆమెను తీసుకుని వెళ్లి, మెడకు టవల్ చుట్టి, ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది.

అనంతరం చిన్నారి మృతదేహాన్ని గోనె సంచీలో వేసుకుని ఇంద్రపాలెం వంతెనపై నుంచి ఉప్పుటేరులోకి విసిరేసింది. ఆ తరువాత ఏమి ఎరగనట్టు పాప కనిపించడం లేదంటూ నంగనాచి నాటకాలు ఆడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. శాంతికుమారే నిందితురాలని తేల్చారు. తనకు పుట్టిన కుమారుడిని సరిగ్గా చూసుకోని కారణంగానే, తాను ఈ పనికి ఒడిగట్టినట్టు ఆమె విచారణలో అంగీకరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories