ఆ వార్తలు అవాస్తవం : వైసీపీ నేత దాసరి బాలవర్ధనరావు

ఆ వార్తలు అవాస్తవం : వైసీపీ నేత దాసరి బాలవర్ధనరావు
x
Highlights

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరుపున యార్లగడ్డ వెంకట్రావే పోటీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత దాసరి బాలవర్ధనరావు స్పష్టం...

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరుపున యార్లగడ్డ వెంకట్రావే పోటీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత దాసరి బాలవర్ధనరావు స్పష్టం చేశారు. తానేదో గన్నవరం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాని.. జగనే నన్నే పోటీచేయ్యమన్నారని చెప్పినట్టు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని అన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైసీపీ అభ్యర్థిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గన్నవరంలో టీడీపీ నేతలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో వైఎస్సార్‌ సీపీ నేతలపై వందల్లో కేసులు నమోదు అయ్యాయని గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కాగా వైసీపీ నేత, జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి మృతిపై యార్లగడ్డ వెంకట్రావు, బాలవర్ధనరావు సంతాపం తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories