Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం

Darshan of Malayappa Swamy in Mohini Avatar at Tirumala Brahmotsavam
x

Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం

Highlights

Tirumala: పల్లకీలో తన అందాన్ని అద్ధంలో చూసుకుని మురిసిపోయిన మలయప్ప.. భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన శ్రీవారు

Tirumala: మంగళవాయిద్యాలు.. వేదమంత్రోచ్ఛారణల నడుమ మలయప్పస్వామి పల్లకీ వాహనంలో మోహినీ అవతారంలో దర్శనమిచ్చి భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. తమిళనాడులోని శ్రీవెల్లి పుత్తూరునుంచి గోదాదేవి పంపిన సుగంధపరిమళ హారం, బంగారు జడతో మోహినీరూపుడైన మలయప్పస్వామివారు తిరువీధుల్లో విహరించారు. తిరువీధుల్లో మహిళల కోలాటాలు, లయబద్ధంగా సాగిన పదనర్తనలతో ఆహూతుల్ని ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. పల్లకీని అధిష్టించిన స్వామివారు సిగ్గులొలుకుతూ తన అందాన్ని అద్దంలోచూసుకుని మురిసిపోతున్నట్లు, దివ్యాలంకార శోభితురాలైన మోహిని మనోహరరూపంతో భక్తులను కనువిందుచేశారు. అన్నమయ్య కీర్తనలు, గోవిందనామాల స్మరణతో భక్తులు పరవశించిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories