వైసీపీలో దగ్గుబాటి చేరికను వారు స్వాగతిస్తారా?

వైసీపీలో దగ్గుబాటి చేరికను వారు స్వాగతిస్తారా?
x
Highlights

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాకలు తీరిన రాజకీయ ఫ్యామిలీగా గుర్తింపు పొందిన దగ్గుబాటి ఫ్యామిలీ సంచలన నిర్ణయం...

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాకలు తీరిన రాజకీయ ఫ్యామిలీగా గుర్తింపు పొందిన దగ్గుబాటి ఫ్యామిలీ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బీజేపీలో, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరావు కుమారుడు హితేష్ చెంచురామ్ వైసీపీలో చేరాలని ఫిక్స్ అయ్యారు. హితేష్ ను పర్చూరు నియోజకవర్గం బరిలో ఉంచాలని దగ్గుబాటి వెంకటేశ్వరావు భావించారు. అయితే అందుకు టీడీపీ, బీజేపీ పార్టీలు ఉన్నా వైసీపీనే మేలనే భావనలో ఆయన ఉన్నారట. దాంతో రెండు నెలల కిందట కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే వారు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ పురందేశ్వరి విషయంలో ఆలోచన చేశారట. దాంతో ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చారు. పురందేశ్వరి బీజేపీ లో ఉండాలని.. తండ్రీకొడుకులు మాత్రం వైసీపీలోకి వెళ్లాలని అనుకున్నారట. అందులో భాగంగా ఆదివారం జగన్ తో భేటీ అయ్యారు.

మరోవైపు దగ్గుబాటి ఫ్యామిలీకే పర్చూరు వైసీపీ టికెట్ అని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఏలూరు సాంబశివరావు విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి భరత్ ఓటమిపాలవడంతో 2019 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో పర్చూరు వైసీపీ సమన్వయకర్తగా రావి రామనాధంబాబును అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో రామనాధంబాబును కాదని హితేష్‌కు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని గొట్టిపాటి భరత్, రామనాధంబాబు స్వాగతిస్తారా అన్న చర్చ మొదలైంది. మరోవైపు కుమారుడు రాజకీయ భవితవ్యం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న దగ్గుబాటి ఫ్యామిలీని నియోజకవర్గంలో ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories