Cyclone Mountha: కాకినాడ టు నెల్లూరు రెడ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలే!


Cyclone Mountha: కాకినాడ టు నెల్లూరు రెడ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలే!
ఏపీ తీరాన్ని వణికిస్తున్న మోంథా. తీరంలో భీకర గాలులు, కల్లోలంగా మారిన సముద్రం. కోస్తాంధ్ర జిల్లాల్లో పడుతున్న వర్షం. కాకినాడ, విశాఖ సముద్ర తీరంలో ఎగసిపడుతున్న అఅలు.
కాకినాడ టు నెల్లూరు రెడ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలే! వణికిస్తోన్న మోంథా. ఏపీ తీరాన్ని వణికిస్తున్న మోంథా. తీరంలో భీకర గాలులు, కల్లోలంగా మారిన సముద్రం. కోస్తాంధ్ర జిల్లాల్లో పడుతున్న వర్షం. కాకినాడ, విశాఖ సముద్ర తీరంలో ఎగసిపడుతున్న అఅలు. భారీగా వీస్తున్న ఈదురు గాలులు. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం. తీరం దాటే సమయంలో.. ప్రచండ గాలులు. అప్రమత్తమైన అధికారులు. నిర్మానుష్యంగా మారిన బీచ్‌లు. 69 గ్రామాలపై దృష్టి సారించాం: విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి. విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సమీక్ష. మోంథా తుఫాను ఎదుర్కోడానికి సర్వ సన్నద్ధంగా ఉన్నాం. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తున్నాం. 69 తుఫాను ప్రభావితమయ్యే అవకాశం ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. పునరావాస కేంద్రాలు గుర్తించి, ఆహార పదార్థాలను, మందులను సిద్ధంగా ఉంచాం. సచివాలయాల్లో సిబ్బందిని సిద్ధంగా ఉంచి గ్రామస్థాయిలో సైతం యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాం. తుఫాను రేపు తీరాన్ని తాకే అవకాశం ఉంది. భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు.
సైక్లోన్ మోంథా.. అత్యంత భారీ వర్షాలకు అవకాశం. కాకినాడ తీరం వైపు తీవ్ర దూసుకొస్తున్న తుఫాన్ మోంథా. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 650, కాకినాడకు 620 కి.మీ దూరంలో కేంద్రీకృతం. రేపు సాయంత్రం కాకినాడ పరిసరాల్లో తీరం దాటనున్న తీవ్ర తుఫాన్. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు పెంపు. అన్ని పోర్టుల్లోనూ మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ. కాకినాడ నుంచి నెల్లూరు వరకు రెడ్ అలెర్ట్ జారీ. భారీ నుంచి అతిభారీ.. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం. అంతకంతకూ పెరుగుతున్న మోంథా ప్రభావం. ఏపీ తీర ప్రాంతాల్లో మొదలైన మోంథా ప్రభావం. కాకినాడ, విశాఖ, నెల్లూరు జిల్లాలతో పాటు పలు చోట్ల వర్షం. అంతకంతకు పెరుగుతున్న గాలుల తీవ్రత. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. ఎక్కడికక్కడే హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాట్లు. రాబోయే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు అధికారుల సూచన. అత్యవసరమైతే మాత్రమే బయటకు రండి: నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా. నెల్లూరు జిల్లాలో వర్షం మొదలైంది. ఈ రాత్రికి జిల్లా లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 9 మండలాల్లోని 42 గ్రామాలకు హై అలెర్ట్ ప్రకటింఛాం. NDRF SDRF బృందాలు సిద్దంగా ఉన్నాయి.. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహాయక చర్యలకు బృందాలు సిద్దంగా ఉన్నాయి. సోమశిల వరద పెరిగితే నీట మునిగే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ప్రజలు అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలి. మొదలైన మోంథా అలజడి. ఏపీ తీర ప్రాంతాల్లో అలజడి రేపుతున్న మోంథా తుపాను. కాకినాడ సముద్ర తీరంలో అల్లకల్లోలంగా సముద్రం. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షం. ఇవాళ రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు. అన్ని ఓడరేవుల్లో కొనసాగుతున్న ప్రమాద హెచ్చరికలు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు. బీచ్, పర్యాటక ప్రాంతాలు తాత్కాలికంగా మూసివేత. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులను వెనక్కి పంపుతున్న అధికారులు. నెల్లూరుపై మొదలైన మోంథా ప్రభావం. నెల్లూరులో మొదలైన మోంథా ప్రభావం. కురుస్తున్న భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉన్న అధికార యంత్రాంగం.
దూసుకొస్తున్న మోంథా తుపాను. ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న అలలు. ఆందోళనలో ఉప్పాడ తీర ప్రజలు. పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళాలని అధికారుల ఆదేశం. దిశ మార్చుకోనున్న మోంథా. 36-48 గంటల్లో తీరం దాటే అవకాశం. కాకినాడ వద్ద తీరాన్ని తాకే సమయంలో గమనం మార్చుకోనున్న మోంథా. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న తుపాను. ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి.. రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం. సాయంత్రానికి కాకినాడ-తుని వద్ద తీరం దాటనున్న మోంథా. విజయనగరం తుపాను కంట్రోల్ రూమ్‌ల నెంబర్లివే.. మొoథా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలకు చాన్స్. విజయనగరం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల మొదలు.. అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవులు. అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి ఆదేశం.
విజయనగరం తుపాను కంట్రోల్ రూముల వివరాలుకలెక్టర్ ఆఫీస్ : 08922-236947, 8523876706,
రెవెన్యూ డివిజినల్ ఆఫీస్, విజయనగరం 8885893515,
రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ చీపురుపల్లి 9704995807.
రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ బొబ్బిలి 9989369511.
మున్సిపల్ కార్పొరేషన్ విజయనగరం 9849906486
ఏపీ ఈపీడీసీఎల్ 9490610102టోల్ ఫ్రీ నెంబర్ 1912.
తరుముకొస్తున్న మోంథా. నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మోంథా తుపాను. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో కదిలిన తుపాను. ప్రస్తుతానికి చెన్నైకి 560కి.మీ, కాకినాడకి 620 కి.మీ., విశాఖపట్నంకి 650 కి.మీ దూరంలో కేంద్రీకృతం. తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం. తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు. వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా చేయొద్దని.. అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచన. విశాఖలో మొదలైన వాన. విశాఖను కమ్మేసిన కారు మబ్బులు. విశాఖలో మొదలైన వాన. తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. మోంథా ఎఫెక్ట్.. తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్. తెలంగాణపై మోంథా సైక్లోన్ ప్రభావం. తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం. 11 జిల్లాలకు ఎల్లో, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి కి వర్ష సూచన. సిద్ధిపేట, సూర్యాపేటలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే చాన్స్. మత్స్యకారులకు హైఅలర్ట్. మోంథా నేపథ్యంలో మత్స్యకారులకు హైఅలర్ట్. ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకెళ్లిన 82 బోట్లు ఇంకా సముద్రంలోనే! తుపాను ప్రభావంతో అలజడిగా మారిన సముద్రం. తక్షణం వెనక్కి రావాలని ఆదేశాలు జారీ. నౌక మిత్ర యాప్ ద్వారా హెచ్చరికలు పంపిస్తున్న యంత్రాంగం. సమీపాల్లో ఉన్న హార్బర్‌లకు వెళ్లిపోవాలని సూచన. బలపడిన మోంథా. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను. అర్ధరాత్రి తుఫానుగా బలపడినట్టు ప్రకటించిన ఐఎండీ. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా 16 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న సైక్లోన్ మోంథా. కాకినాడకి ఆగ్నేయంగా 680 కి.మీ., విశాఖపట్నం ఆగ్నేయంగా 710 కి.మీ. దూరంలో కేంద్రీకృతం. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం. రేపు సాయంత్రం కాకినాడ దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా. తీరం దాటేసమయంలో గరిష్టంగా గంటకు 90-100 కి.మీ. వేగంతో గాలులు. ఇవాళ, రేపు ఏపీ అంతటా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. విశాఖలో సైక్లోన్ అలెర్ట్. మోంథా తుపాను నేపథ్యంలో అన్ని పర్యాటక కేంద్రాలు మూసివేత. వైజాగ్ బీచ్ లోకి నో ఎంట్రీ. కైలాసగిరి, వుడా పార్క్, మ్యూజియం, సబ్ మెరైన్ సహా పలు టూరిజం స్పాట్స్ మూసివేత. తుఫాన్ కారణం నిర్ణయం తీసుకున్న వీఎంఆర్‌డీఏ. రైల్వే జోన్ హైఅలర్ట్. మోంథా నేపథ్యంలో రైల్వే జోన్ హైఅలర్ట్. రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థపై నిఘా. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం చేసిన అధికారులు. ట్రాక్, సిగ్నలింగ్, విద్యుత్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో కంట్రోల్ రూమ్‌లు. తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న వాల్తేరు డీఆర్‌ఎం. ఏలూరుపై మోంథా ప్రభావం. మోంథా కారణంగా అప్రమత్తమైన ఏలూరు అధికారులు. నేడు, రేపు స్కూళ్లకు సెలవులు. గోదావరి నదిలో పర్యాటక లాంచీలు నిలిపివేత. అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు. సాయం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు 94910 41419, 18002331077.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 3 రోజుల సెలవులు. మోంథా కారణంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్. మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు. విజయవాడ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు.. నెంబర్ 915497045. విజయనగరంలో.. విజయనగరంపై మోంథా ఎఫెక్ట్. భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. విజయనగరం జిల్లాలో మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు. నేటి నుంచి మూడు రోజులపాటు ప్రకటించిన కలెక్టర్. తుపాను నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు. రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్. మోంథా తుపాను నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు. నెల్లూరు, కోనసీమ, శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్. ఒక్కో జిల్లాకు 30 మందితో కూడిన బృందం. ఇప్పటికే కాకినాడ చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్. తుపానుతో కాకినాడపైనే ఎక్కువ ప్రభావం పడొచ్చంటున్న వాతావరణ శాఖ. అప్రమత్తమైన ఉమ్మడి విశాఖ అధికార యంత్రాంగం. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రెండ్రోజులపాటు స్కూళ్లకు సెలవు. నేడు, రేపు సెలవు ప్రకటించిన కలెక్టర్. మోంథా తుపాను కారణంగా సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు. మొదలైన మోంథా ఎఫెక్ట్. ఏపీ వైపు దూసుకొస్తున్నమోంథా. కాకినాడ వద్ద మొదలైన మోంథా ఎఫెక్ట్. అల్లకల్లోలంగా సముద్ర వాతావరణం. భారీగా వీస్తున్న గాలులు. తీర ప్రాంత మండలాల్లో హైఅలర్ట్. ఆరు మండలాలపై ప్రభావం చూపే అవకాశం. ఈరోజు, రేపు భారీ నుంచి అతి భౠరీ వర్షాలు. జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు. కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు. మోంథా నేపథ్యంలో స్కూళ్లకు సెలవు. కాకినాడలో ఐదు రోజులపాటు సెలవు ప్రకటించిన కలెక్టర్. కాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేత. తుపాను కారణంగా బీచ్‌లు మూసివేత.
ఇవాళ ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు. నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు. కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ. ఏపీకి మోంథా తుపాను ముప్పు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. నేడు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం. రేపు ఉదయానికి తీవ్ర తుపానుఆ మారే అవకాశం. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. నెల్లూరులో భారీ వర్షాలు.. ఎవరూ బయటకు రావొద్దు.. తీరం దాటే సమయంలో బలపడనున్న తుఫాను.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



