Cyclone Montha: తీవ్రత కోల్పోయిన మొంథా.. తెలంగాణ, ఏపీలో వర్షాల అలర్ట్

మరింత బలహీన పడిన మెంథా తుఫాన్ వాయుగుండంగా మారిన తుఫాన్ దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతున్న వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడుతున్న వాయుగుండం

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Oct 2025 11:05 AM IST
Cyclone Montha: తీవ్రత కోల్పోయిన మొంథా.. తెలంగాణ, ఏపీలో వర్షాల అలర్ట్
X

Cyclone Montha: తీవ్రత కోల్పోయిన మొంథా.. తెలంగాణ, ఏపీలో వర్షాల అలర్ట్

మొంథా తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది. గడిచిన 6 గంటలుగా ఇది 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తెలంగాణ రాష్ట్రంపై దీని ప్రభావం కొనసాగుతోంది. భద్రాచలానికి 50 కిలోమీటర్లు, ఖమ్మం జిల్లాకు 110 కిలోమీటర్లు దూరంలో వాయుగుండంలో కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడింది. దీని కారణంగా రానున్న 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో ఒకట్రెండు ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది..


విశాఖ, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని మిగతా జిల్లాల్లో అక్కడకక్కడ తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story