తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం.. దూసుకొస్తున్న 'క్యార్'

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం.. దూసుకొస్తున్న క్యార్
x
Highlights

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉంది. రానున్న 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది....

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉంది. రానున్న 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన మాంద్యం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులను అప్రమత్తం చేసింది. అరేబియా సముద్రంలో తుఫాను హరికేన్‌గా మారి ఒమన్ నుంచి భారత్‌కు కదులుతోంది ఈ తుఫానుకు 'క్యార్' అని నామకరణం చేశారు. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ముంబైకి దక్షిణాన 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాను రత్నగిరికి పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాబోయే 24 గంటల్లో ఉత్తర, దక్షిణ గోవా జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని అలాగే, మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్.. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని.. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుందని అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్సకారుల ఈనెల 29 వరకు వేటకు వెళ్లోద్దని హెచ్చరిస్తున్నారు. కాగా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories