Weather Update: సముద్రంలో అలజడి..ఐవోన్ తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్

Weather  Update: సముద్రంలో అలజడి..ఐవోన్ తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్
x
Highlights

Cyclone Ivon in the Indian OceanWeather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ కీలక సమాచారం అందించింది. భారత వాతావరణ శాఖ అంచనాలకు మించి హిందూ మహా...

Cyclone Ivon in the Indian Ocean

Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ కీలక సమాచారం అందించింది. భారత వాతావరణ శాఖ అంచనాలకు మించి హిందూ మహా సముద్రంలో అలజడి నెలకొంది. దానికి ఐవోన్ అనే పేరు పెట్టారు. మొన్న ఆవర్తనంగా ఉన్న ఆ తుపాన్ నిన్న అల్పపీడనంగా మారి నేడు తుపాన్ గా మారింది. ప్రస్తుతం దాని సుడి వేగం గంటకు 75కిలోమీటర్లు గా ఉంది. మధ్య స్థాయి తుపాన్ అని అంచనా వేశారు. ఈ తుపాన్ భూమధ్య రేఖావైపు వెళ్తుందనే అంచనా వేసింది ఐఎండీ. ఒకవేళ దిశ మార్చుకున్నట్లయితే అప్పుడు భారత్ వైపు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది.

శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాలకు మేఘాలు పెద్దగా రావని తెలిపింది. రోజంతా వాతావరణం వేడిగానే ఉంటుందని ఆగ్నేయ బంగాళాఖాతం నుంచిభారీగా మేఘాలు బయలుదేరినట్లు తెలిపింది. సోమవారం నాటికి ఏపీ, తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. వాటి వల్ల ఇప్పటికే బంగాళాఖాతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ మేఘాలు రాష్ట్రాలకు వచ్చినట్లయితే వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది.

ఇక ఉష్ణోగ్రత చూస్తే.. నేడు తెలంగాణలో 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. హైదరాబాద్, రామగుండం, గద్వాల్, మహబూబ్‌నగర్, తాండూరు, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్‌లో నేడు ఎండలు దంచికొడతాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుండగా... రాయలసీమ భగ్గుమంటుంది. అనంతపురం, కర్నూలు, ఆధోని, రాయదుర్గం, గుంతకల్, నంద్యాల, పులివెందుల, కడప, ప్రొద్దుటూర్, కదిరి, హిందూపురంలో వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories