ఉత్తరాంధ్రకు తప్పిన తుఫాన్ ముప్పు!

ఉత్తరాంధ్రకు తప్పిన తుఫాన్ ముప్పు!
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పిన ఫోని తుఫాను సూపర్ సైక్లోన్‌గా మారి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ఈ పెను తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా దిశగా పయనిస్తూ...

బంగాళాఖాతంలో ఏర్పిన ఫోని తుఫాను సూపర్ సైక్లోన్‌గా మారి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ఈ పెను తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా దిశగా పయనిస్తూ శుక్రవారం మధ్యాహ్నానికి గోపాలపూర్‌-చాంద్‌బలీ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు తుఫాను ముప్పు ఉత్తరాంధ్రకు తప్పినట్టేనని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ జె నివాస్‌ మాట్లాడుతూ...ఫొని తుపాన్‌ జిల్లాను దాటిందని, కంచిలి మండలంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు.

ఇచ్చాపురం మండలంలో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయని వెల్లడించారు. అయితే ఈ తుఫాను శ్రీకాకుళం జిల్లాను దాటినా, దాని ప్రభావం 30 కిలోమీటర్ల వరకూ ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పూరికి 40 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ఉదయం లేదా మధ్యాహ్ననికి పూరికి సమీపంలో తుపాను తీరం దాటనుంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ, క్రమేణా బలహీనపడి అతి తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories