దిశ మార్చుకున్న బుల్‌బుల్‌ తుపాన్‌..

దిశ మార్చుకున్న బుల్‌బుల్‌ తుపాన్‌..
x
Highlights

ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో బుల్‌బుల్‌ తుఫాను హెచ్చరికలతో మళ్ళీ టెన్షన్ నెలకొంది....

ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో బుల్‌బుల్‌ తుఫాను హెచ్చరికలతో మళ్ళీ టెన్షన్ నెలకొంది. అయితే ఏపీకి బుల్‌బుల్‌ తుపాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగతున్న బుల్‌బుల్‌ తీవ్ర తుపాను శుక్రవారం దిశ మార్చుకుందని.. ప్రస్తుతం ఇది పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ నైరుతి దిశగా 450 కి.మీ, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తరదిశగా పయనిస్తున్న ఈ తీవ్ర తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది.

అయితే శనివారం ఉదయం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ క్రమంగా బలహీనపడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అయితే శనివారం అర్ధరాత్రి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల మధ్య తీరం దాటనుందని.. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories