రేపటి నుంచి మూడురోజులు భారీ తుపాను.. మళ్లీ మే నుంచి వరుణగండం

రేపటి నుంచి మూడురోజులు భారీ తుపాను.. మళ్లీ మే నుంచి వరుణగండం
x
Highlights

రైతులను, ప్రజలను కరోనా కలవరం పెడుతుంటే, ఇప్పుడు తుఫాన్లు కూడా వణికిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

రైతులను, ప్రజలను కరోనా కలవరం పెడుతుంటే,ఇప్పుడు తుఫాన్లు కూడా వణికిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం నుంచి వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈనెల (ఏప్రిల్) 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వల్ల భారీ తుఫాను మొదలు కానుంది. దీని ప్రభావం కోస్తా తీర ప్రాంతంలో ఆనుకొని ఉన్న రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో పాలు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, సముద్రతీర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఈ సీజన్‌లో ఏర్పడే తొలి తుపాను ఇదే కావడం విశేషం.

అండమాన్ నికోబర్ దీవుల్లో ఏర్పడే తుపాను కోస్తా ప్రాంతాలను అతలాకుతలం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాను ప్రభావం ఈనెల 28, 29, 30 తేదీల్లో ఉంటుందని, కుండపోత వానలు కూడా కురుస్తాయని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మే1న ఉత్తర అండమాన్ నికోబార్ దీవుల్లో మరో తుపాను ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

అయితే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కట్టడి చేసే పనిలో ప్రభుత్వాలు, అధికారులు తలమునకలై ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. ఏపీలో శనివారం అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. శనివారం కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి, అరటి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories