లేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్

లేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్
x
Highlights

దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన హైదరాబాద్ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రస్తుతం రెండు రోజుల పాటు సెలవుల్లో ఉన్నారు. దీంతో ఆయన తన సొంత రాష్ట్రం...

దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన హైదరాబాద్ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రస్తుతం రెండు రోజుల పాటు సెలవుల్లో ఉన్నారు. దీంతో ఆయన తన సొంత రాష్ట్రం కర్నాటకలోని హుబ్లీ వెలుతూ మార్గమద్యంలో లేపాక్షి ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తన వ్యక్తిగత భద్రతతో పాటూ అనంతపురం జిల్లా పోలీసుల భద్రత మధ్య అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎంతో చరిత్ర కలిగిన లేపాక్షి ఆలయాన్ని ఆయన సందర్శించారు. దీంతో ఆయనకు, ఆ‍యన కుటుంబ సభ్యులకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించి వీరభద్రస్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించారు. దాంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని మర్యాదపూర్వకంగా అందజేశారు.

ప్రతి ఏటా తన సొంత రాష్ట్రం కర్ణాటకలోని హుబ్లీ, అలాగే తన సొంత ఊరికి వెలుతున్న ప్రతిసారీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా చేసుకున్నారు. దర్శనానంతరం అక్కడి నుంచి సొంత ఊరికి బయల్దేరి వెళ్లారు. ఇదిలా ఉంటే సజ్జనార్ ఆలయ దర్శనానికి వెళ్లిన సంగతి తెలుసుకున్న భక్తులు, స్థానికులు సూపర్ కాబ్ ని చూడడానికి అక్కడికి తండోపతండాలుగా తరలి వచ్చారు. ఆయన ఆటోగ్రాఫ్, కరచాలణం, ఆయనతో సెల్ఫీల కోసం చాలా మంది ప్రయత్నించారు. దీనికి ఆయన స్పందించి వచ్చిన వారిని నవ్వుతూ పలకరించారు.

ఇక సీపీ సజ్జనార్ గురించిన పూర్తి వివరాల్లోకెళితే సీపీ విశ్వనాథ్ సజ్జనార్ 1996 బ్యాచ్‌లో ఐపీఎన్‌ క్యాడర్ ను సంపాదించుకున్నారు. ఈయన కర్ణాటకలోని గదగ్‌ జిల్లా అసుతి గ్రామంలో జన్మించారు. తాను పుట్టింది హుబ్లీలోనే కాబట్టి అక్కడ తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. దిశ హత్య నిందితుల ఎన్ కౌంటర్ చేసిన విషయాన్ని తెలుసుకున్న సజ్జనార్ స్నేహితులు, బంధువులు మిఠాయిలు పంచుకున్నారు.

సీపీకి ఖాళీ సమయం దొరికితే చాలు ఆయన సొంత ఊరికి వెళ్లి సరదాగా తన బాల్య స్నేహితులతో, తన కుటుంబ సభ్యులతో గడుపుతారట. పని విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే ఆయన బాధితులకు న్యాయం చేయడం కోసం శ్రమిస్తారని తెలిపారు. అంతే కాక అందరు వ్యక్తుల్లానే ఆయన కూడా సాధారణ సమయాల్లో ఫ్యామిలీతో జాలీగా గడుపుతారని వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories