టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపణలు

టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపణలు
x
Highlights

తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడిపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపణలు చేశారు.

తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడిపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపణలు చేశారు. సంప్రదాయాలకు విరుద్ధంగా.. మూలవిరాట్‌ వద్ద రమణదీక్షితులు కార్యక్రమాలు చేశాడని.. అడ్డుచెప్పిన సహచర అర్చకులతో గొడవ పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఈ సంఘటనపై విచారణ చేపట్టి... శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. గతేడాది కంటే 2 లక్షల డైరీల తయారీని టీటీడీ కుదించడంతో.. భక్తులు నిరాశపడ్డారని విమర్శించారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై విచారణ చేపట్టాలన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories