సీఆర్డీఏ సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

సీఆర్డీఏ సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగు బిల్లులు, కౌలు రైతులపై చర్చించారు. సమీక్ష వివరాలను మంత్రి...

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగు బిల్లులు, కౌలు రైతులపై చర్చించారు. సమీక్ష వివరాలను మంత్రి బొత్స వెల్లడించారు. రాజధానిలో ఏమి జరిగింది, ఇకపై ఏమి జరగబోతుంది అనే విషయంపై చర్చించామని అన్నారు. రేపటినుంచి కౌలురైతులకు చెక్కులు పంపిణి చెయ్యాలని నిర్ణయించామన్నారు. అర్హత ఉన్న రైతులందరికీ కౌలు అందజేస్తామన్నారు. రాజధాని మార్పుపై మాట్లాడిన బొత్స.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి, తమకు సంబంధం లేదని అన్నారు. రాజధాని అంటే ఐదుకోట్ల ఆంధ్రుల ప్రజలది అన్నారు. ఒక కులానికో, పార్టీకో రాజధాని ఉండదని స్పష్టం చేశారు. 13 జిల్లాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. ఇదిలావుంటే అమరావతి రాజధాని తరలింపుపై స్పష్టత ఇవ్వలేదు రాష్ట్రప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories